ఉక్రెయిన్‌లో జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. ఉక్రెయిన్ పరిస్థితులపై భారత్ కలత చెందుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి T.S. తిరుమూర్తి వెల్లడించారు. హింస అపడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఇక రష్యా దాడి శాంతి విఘాతం కలిగిందని అమెరికా వాదించింది. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్‌లకు ప్రత్యేక గుర్తించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముసాయిదాలో కోరింది. రష్యా దాడి.. ఉక్రేనియన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అంటూ వివిధ ప్రపంచ దేశాలు దాడిని ఖండించాయి.