రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం తెలిపింది. వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారు. ఖార్కివ్‌లో నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు చేసిన దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందారు. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్న రష్యా మాత్రం బాంబులతో విరుచుకుపడుతునే ఉంది. ఉక్రెయిన్ సైన్యం ఉన్న ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ కీవ్ నగరాన్ని స్వాధినం చేసుకోవడానికి రష్యా సైనిక చర్యను ఉద్ధృతం చేసింది. ఇక కీవ్‌లో కర్ఫ్యూ సడలించారు. దీంతో ప్రజలు మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఎదుట క్యూ కట్టారు.