Drunked RTC Driver : ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మధ్యానికి బాగా అలవాటు పడుతున్నారు. ఈ మధ్యన అలవాటు కారణంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతుంటే మరికొందరు మాత్రం మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే… మద్యం మత్తులో బస్సు నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్- 2 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు(TS 08 UB 2219) 30 మంది ప్రయాణికులతో దిల్షుక్నగర్ నుండి తొర్రూర్ కి బయలుదేరింది. అయితే నడుస్తున్న సమయంలో డ్రైవర్ ప్రవర్తన వింతగా ఉండటం తో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వద్దకు చేరుకున్న తర్వాత పోలీసులు బస్సును ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడానికి ప్రయత్నం చేశారు.
బ్రీత్ ఎనలైజర్ ప పరీక్ష చేసినప్పుడు మద్యం శాతం 25 శాతానికి మించి ఉండటం వల్ల పోలీసులు డ్రైవర్ నీ అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా డిపో మేనేజర్ తో మాట్లాడి డ్రైవర్ నీ రప్పించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ని బస్సు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అలాగే బస్సు నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవి.