సినిమాలలోకి రాకపోతే డ్రైవర్ గా మారేవాన్ని… స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన దర్శకుడుగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు సినిమాలలోని పాటకు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఆయన సినిమా అంటే చాలు హీరోయిన్ల మీద పండ్ల వర్షం కురిపిస్తాడు. ఇలా రొమాంటిక్ పాటలే కాకుండా డివోషనల్ సినిమాలు తీయటంలో కూడా రాఘవేంద్ర రావు మంచి దిట్ట. ఈయన తీసిన అన్నమయ్య, శ్రీ రామ దాసు వంటి భక్తిరస సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.

అయితే వయసు మీద పడటంతో రాఘవేంద్రరావు సినిమాలను పూర్తిగా తగ్గించాడు. కాలం క్రితం పెళ్లి పుస్తకం అనే సినిమాకి సమర్పకుడిగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన పర్యవేక్షణలో నిర్మించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్రరావు ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. స్టార్ దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన సినిమాలలోకి రాకపోతే డ్రైవర్ గా మారేవాడినని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు కాకపోతే మీరు జీవితంలో ఏమయ్యేవారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాఘవేంద్రరావు స్పందిస్తూ.. నేను బిఏ పూర్తి చేశాను. కానీ ఆ సమయంలో నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి దర్శకుడిగా మారకపోతే డ్రైవర్ గా మారేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎందుకంటే ఆ రోజులలో బిఎ చేసిన వారి కంటే డ్రైవర్లే ఎక్కువ సంపాదించేవారు. అందువల్ల నేను డ్రైవర్ అయ్యేవాడిని. ఇక డ్రైవర్ మాత్రమే ఎందుకు అంటున్ననంటే నాకు డ్రైవింగ్ తప్ప ఏ విషయం పెద్దగా తెలియదు. అందువల్ల నేను డైరక్టర్ కాకపోతే కచ్చితంగా డ్రైవర్ అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు ఆయన పేరు వెనక బీఏ అని పెట్టుకున్న రెండు మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయని, బీఏ పెట్టని ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యిందని వెల్లడించారు. దీంతో అప్పటినుండి తన పేరు వెనక బీఏ సెంటిమెంట్ గా అనిపించి నా పేరు చివరన బీఏ యాడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు.