Ashu Reddy: హీరోయిన్ సమంతలాగా పోలికలు ఉండటంతో జూనియర్ సమంతగా ఆషు రెడ్డి బాగా ఫేమస్ అయ్యింది. ఇలా ఫేమస్ అవ్వటం వల్ల బిగ్ బాస్ లో పార్టిసిపెట్ చేయటానికి అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ త్రీ లో మొదటిసారిగా పార్టిసిపేట్ చేసిన అషురెడ్డి అక్కడ చేసిన హంగామా వల్ల బాగా గుర్తింపు పొందింది. ఆ సమయంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి లవ్ ట్రాక్ నడిపింది. ఆ సీజన్లో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు తన గ్లామర్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసేది.
అయితే గత కొంత కాలం క్రితం అషురెడ్డి రామ్ గోపాల్ వర్మతో చేసిన హంగామా విషయం గురించి వార్తల్లో నిలిచి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా అషురెడ్డి పార్టిసిపేట్ చేసింది. ఈ సీజన్ ద్వారా అషురెడ్డి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ తో చాలా సన్నిహితంగా ఉంటూ ఈ ముద్దుగుమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అషురెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో అషురెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి ముందు అషురెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ ద్వారా తనకి కాబోయే వాడిని వెతుక్కోవాలి అని చెప్పింది. తనని పెళ్లి చేసుకోబోయే వాడికి వంటలు చేయటం బాగా వచ్చి ఉండాలి అని.. అలాగే డ్రైవింగ్ కూడా బాగా వచ్చి ఉండాలి అని తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో ఆ ఇంటర్వ్యూ లో తెలిపింది. ఇలా తనకి కాబోయే వాడికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి అని చెప్పటంతో పటాస్ హరి మాట్లాడుతూ అదికూడా ఒక క్వాలిటీనా? పెళ్ళైన తర్వాత నువ్వే డ్రైవింగ్ నేర్పించవచ్చు కదా? కొంపతీసి భవిష్యత్తులో ఒక డ్రైవర్ ని కానీ పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అని అంటాడు. దీనికి ఆశు రెడ్డి ‘ స్పందిస్తూ డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేముంది. ప్రేమ ఎప్పుడైనా, ఎవరి మీద అయిన పుడుతుంది’ . అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆశు రెడ్డి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.