ఆర్ఆర్ఆర్: రఘురామకృష్ణరాజు స్వయంకృతాపరాధం.!

RRR, The Actual Reason Behind 'Pain'

RRR, The Actual Reason Behind 'Pain'

రాజకీయాల్లో నోరు జారడం సర్వ సాధారణం. నోటికొచ్చింది మాట్లాడే రాజకీయ నాయకులు చాలామందే కనిపిస్తారు. మీడియాకెక్కి బూతులు తిట్టే మంత్రులున్న రోజులివి. అయితే, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే రాజకీయాల్లో గొప్పోడు. బీజేపీ పెద్దలతో పరిచయాలున్నాయని.. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు వుందని.. అమరావతి రైతుల నుంచి సపోర్ట్ లభిస్తుందనీ, ఓ వర్గం మీడియా నుంచి తనకు తిరుగులేని మద్దతు వుంటుందనే గట్టి నమ్మకంతో చెలరేగిపోయిన రఘురామకృష్ణరాజు, ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు, లోకేష్ విమర్శిస్తున్నారు.. అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నారు.. పవన్ కళ్యాన్ విమర్శిస్తున్నారు.. కాంగ్రెస్ నేతలూ విమర్శిస్తున్నారు.. బీజేపీ సంగతి సరే సరి. రాజకీయాల్లో విమర్శలు చేయడం అనేది తప్పు కాకపోవచ్చు.

కానీ, హద్దులు దాటే విమర్శలు, వెకిలి చేష్టలు, జుగుప్సాకరమైన వ్యవహారశైలి.. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. అదే జరుగుతోంది రఘురామకృష్ణరాజు వ్యవహారంలో. రఘురామ, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శిస్తూ వెళితే అది వేరే లెక్క. ఈ వైఖరి, ఇతర రాజకీయ నాయకులకు చేతకాక కాదు కదా.. వాళ్ళంతా పరిధిలకు లోబడి వ్యవహరిస్తున్నది. ఇక, రాజకీయాల్లో అరెస్టులనేవి సర్వసాధారణం. అరెస్ట్ తర్వాత అయినా రఘురామకృష్ణ తన తప్పుని తెలుసుకుని హద్దుల్లో వుంటారా.? ఇంకోసారి ఇలాంటి చర్యలకే దిగుతారా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అరెస్టు, జైలు నుంచి.. బీజేపీ అధిష్టానంగానీ, టీడీపీగానీ.. ఇలా ఎవరూ రఘురామకృష్ణరాజుని కాపాడలేకపోయారు. ఆయన నేరం చేశారా.? చేస్తే దాని తీవ్రత ఎంత.? అన్నది కోర్టులు తేల్చుతాయి. ఈలోగా రఘురామ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.