Nandigam Suresh: జైల్ నుంచి బయటకు వచ్చిన నందిగం సురేష్… జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు!

Nandigam Suresh: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీకి చెందిన పలువురు నేతలు వివిధ కేసులలో అరెస్ట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నందిగాం సురేష్ సైతం ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లారు అయితే తాజాగా ఈయనకు మరోసారి బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు . అయితే ఈయన విడుదల విషయంలో షూరిటీలను సమర్పించడం కాస్త ఆలస్యం కావడంతో ఈయన తాజాగా బయటకు వచ్చారు.

జైలు నుంచి బయటకు రాగానే జైలు ఆవరణంలో నందిగం సురేష్ పలువురు వైసీపీ నేతలను కలిశారు. అనంతరం ఈయన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు.. పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడన్న సురేష్‌.. నాకు ఉన్న ఏకైక కోరిక మరణం వరకు జగనన్నతోనే ఉండాలని ఈయన తెలిపారు.

జగనన్న మనిషిగా మాత్రమే చనిపోతా.. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు పెట్టినా.. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటా అన్నారు. ఇక, కూటమి పాలనలో అరాచకాలు శృతిమించాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. పాలన పక్కనపెట్టి, కక్షలకే పరిమితమయ్యారు. దేవుడి భయం ఉన్న ఎవరు ఇలాంటి పనులు చేయరు అంటూ జగన్మోహన్ రెడ్డి పై తనకున్నటువంటి గౌరవం అభిమానాన్ని ఈ సందర్భంగా నందిగం సురేష్ బయట పెట్టారు. ఒక సాధారణ జీవితం గడుపుతున్న నందిగం సురేష్ కు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చి ఈయన ఎంపీ అభ్యర్థిగా గెలిపించారు. దీంతో నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా మారడమే కాకుండా ఇలా కృతజ్ఞతలు చాటుకుంటున్నారని చెప్పాలి.