RRR : “RRR” సెన్సేషన్.. సినిమా ఆగినా రికార్డులు ఆగలేదు.!

RRR : ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ పాన్ ఇండియన్ సినిమా దగ్గర చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతి కొద్ది భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదల ఇంకా వారం ఉంది అనగా నిలిచిపోయింది.

అయితే ఈ సినీమా విడుదల ఆగినా ఈ సినిమా తాలూకా సెన్సేషన్ మాత్రం ఆగలేదని చెప్పాలి. ఈ సినిమా కి దేశ వ్యాప్తంగా నెలకొన్న హైప్ కి ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా ట్రైలర్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ట్రైలరే టాలీవుడ్ లో భారీ రికార్డు అందుకుంది.

తెలుగులో లేటెస్ట్ గా ఈ ట్రైలర్ 50 మిలియన్ సెన్సేషనల్ వ్యూస్ ని అందుకొని టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యంత వేగంగా ఈ మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా కొత్త రికార్డు సెట్ చేసింది. దీనితో ఈ భారీ సినిమా హవా ఎక్కడా తగ్గలేదని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ లు నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య దాదాపు 500 కోట్లతో ఈ సినిమాని నిర్మాణం వహించారు.