RRR New Condom Advt : ‘ఆర్ఆర్ఆర్’: రొమాన్స్ కావాలా.? కండోమ్ తీస్కో.!

RRR New Condom Advt : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తోన్న విషయం విదితమే. సినిమాలో రొమాన్స్ లేదంటూ కొన్ని రివ్యూలు రావడంపై సినీ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క, సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ కొత్త పోస్టర్ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దీనికి ఎలాంటి సంబంధం లేదు.. ఒక్క పేరు తప్ప. ఇది ‘ఆర్ఆర్ఆర్’ కండోమ్ ప్రకటన.

‘రా.. రెస్పాన్సిబుల్.. రొమాన్స్’ అంటూ స్కోర్ అనే సంస్థకు చెందిన కండోమ్ ప్రమోషన్ ఇది. అచ్చం ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ తరహాలో దీన్ని డిజైన్ చేశారు.

ఈ కొత్త ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అదే సమయంలో, దీన్ని వైరల్ చూస్తూ, ‘ఆర్ఆర్ఆర్’ హేటర్స్‌కి ధీటుగా బదులిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు.

‘ఆర్ఆర్ఆర్’ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఇన్నోవేటివ్ ప్రచారం చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రోడ్డు రవాణా.. అంటూ ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త అర్థాన్నిచ్చింది తెలంగాణ ఆర్టీసీ.