తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. పైగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. సుమారు 300 కోట్లకు మించిన వ్యయంతో డివివి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నీ బాగుంటే ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా దెబ్బకు వాయిదాపడి ఏడాది ఆలస్యం అయింది. ఈ 2021లో అయినా సినిమా ఉంటుంది అనుకుంటే అదీ జరగలేదు. సెకండ్ వేవ్ అడ్డు తగిలింది. ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలి అంటే ఇంకో మూడు నాలుగు నెలల వర్క్ జరగాల్సి ఉంది.
దీంతో టీమ్ సంక్రాంతి బరిలో చిత్రాన్ని నిలపాలని భావించింది. ఇప్పుడు అది కూడ సాధ్యపడేలా లేదు. ఎందుకంటే త్వరలో థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లకు మించి ఈ థర్డ్ వేవ్ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడ అన్ని విధాలుగా సిద్దమవుతున్నాయి. అవసరం అయితే మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ఉండొచ్చని అంటున్నారు. వచ్చే నెల నుండి థియేటర్లు తెరుచుకున్నా థర్డ్ వేవ్ గట్టిగా తగిలితే మాత్రం మళ్లీ మూతబడక తప్పదు. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ 2022 సంక్రాంతిని కూడ వదులుకుని 2022 వేసవికి వెళుతుంది. సో.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ థర్డ్ వేవ్ తీవ్రత మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట.