RRR : బిగ్ బజ్ : “అఖండ”లో “RRR” స్టార్ నటుడు..ఎలా సాధ్యం అంటే

RRR : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చి భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ” కూడా చోటు సంపాదించుకుంది. నెవర్ బిఫోర్ లుక్ మరియు విజువల్స్ తో బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించడంతో అన్ని చోట్ల కూడా గట్టి కలెక్షన్ అందుకొని హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

అయితే ఈ సినిమాలో ఇప్పుడు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “RRR” నటుడు ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఇదెలా సాధ్యం అంటే అఖండ అయ్యిన హిట్ చూసి బాలీవుడ్ వర్గాల వారి కన్ను ఈ సినిమా రీమేక్ పై పడ్డాయట. అందుకే ఈ సినిమాకి మంచి ఫాన్సీ రేట్ ఇచ్చి హక్కులు కొనెయ్యాలని చూస్తున్నారట.

అందుకే ఈ చిత్రం హిందీలో హీరోగా ‘RRR’ లో నటించినటువంటి బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ పేరు ఫైనల్ లిస్ట్ లో వినిపిస్తుందట. అందుకే ఇప్పుడు అఖండ పేరు బాలీవుడ్ లో బిగ్ బజ్ గా వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాల్సిందే.