RRR Movie : “RRR” వారు ఇచ్చిన ఈ షాక్ తో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.!

RRR Movie : ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి. తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ఏడాది కరోనా మూడో వేవ్ బ్రేక్ ఇచ్చింది.

అయితే ఇక్కడ నుంచి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని చూస్తుండగా నిన్న అసలు ఎలాంటి హింట్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ రెండు రిలీజ్ డేట్స్ ఇచ్చేసి షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. అయితే ఒక డేట్ ఇవ్వాలి లేదా ఇవ్వకుండా ఉండాలి కానీ ఈ అనౌన్సమెంట్ ఏంటి అని అనుకుంటున్నారు అంతా. మరి ఈ డేట్స్ చూసినట్టు అయితే ఒకటి మార్చ్ 18 కాగా మరొకటి ఏప్రిల్ 28గా ఫిక్స్ చేశారు.

అయితే ఇది కూడా కరోనా పరిస్థితి మారి దేశ వ్యాప్తంగా థియేటర్స్ అన్నీ 100 శాతం ఆక్యుపెన్సీ తో రన్ అయితేనే చేస్తామని ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు. సినిమా అయితే ఆల్రెడీ రెడీ అయ్యిపోయింది అని మంచి టైం కోసమే చూస్తున్నామని తెలిపారు. కానీ ఈ రెండు డేట్ ల అనౌన్సమెంట్ ఏదైతే ఉందో అది మాత్రం అభిమానులకి ఒకింత ఊహించని షాక్ నే ఇచ్చింది.