RRR Beauty : హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన “RRR” బ్యూటీ..సమంత రిప్లై వైరల్.!

RRR Beauty : ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అవి హాలీవుడ్ సినిమాలు అనే చెప్పాలి. దాదాపు అన్ని భాషల్లోని హాలీవుడ్ సినిమాలకి మార్కెట్ ఉంది. అందుకే హాలీవుడ్ సినిమాలు ఎప్పుడు విశిష్టంగానే ఉంటాయి. కానీ ఇలాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు గాని దర్శకులకి గాని మన భారతదేశపు పురాణాలు గాని మన దర్శకుల విజన్ గాని అనేక సందర్భాల్లో ప్రేరణగా నిలవడం మనకి గర్వకారణం.
అయితే ఇలాంటి హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియా కి చెందిన స్టార్స్ కనబడితేనే ఎంతో ఆసక్తిగా ఆనందం కనబరిచే మనస్తత్వం మనవాళ్లది. మరి ఈ లిస్ట్ లో చాలా తక్కువ మందే ఉంటారు కానీ.. లేటెస్ట్ గా అయితే మన దేశపు ప్రతిష్టాత్మక చిత్రం అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) సినిమా నటి ఆలియా భట్ హాలీవుడ్ ఆఫర్ సొంతం చేసుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ప్లాన్ చేసిన భారీ హాలీవుడ్ సినిమా “హార్ట్ ఆఫ్ స్టోన్” లో ఆలియా భట్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టుగా లేటెస్ట్ గా ప్రకటించడం జరిగింది. దీనిని ఆలియా కూడా కన్ఫర్మ్ చెయ్యగా అనేక మంది ఇతర ఫిల్మ్ స్టార్స్ ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు.
వీరిలో సమంతా కూడా ఎగ్జైటింగ్ రిప్లై ని ఇవ్వగా అది వైరల్ అవుతుంది. అయితే ఈ హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో “వండర్ వుమన్” నటి గాళ్ గాడోట్ కూడా నటిస్తుంది. ఇలాంటి స్టార్స్ తో ఇండియన్ నటి గా ఆలియా కనబడనుండటం ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.