Roja: తిరుపతి ప్రతిష్టను చెడగొడుతున్నారు… వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల దాడి పై ఫైర్ అయిన రోజా?

Roja: మున్సిపల్‌ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతూ వైఎస్సార్సీపి కార్పొరేటర్ల పై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఓట్లు వేయడం కోసం వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ల బస్సు పై రాళ్ల దాడికి పాల్పడ్డారు అలాగే కొంతమంది కార్పోరేటర్లను అపహరించే ప్రయత్నాలు కూడా చేశారు ప్రస్తుతమెందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఇలా కార్పొరేటర్ల పట్ల అనుచితంగా వ్యవహరించిన జనసేన టిడిపి బీజేపీ కార్యకర్తల తీరుపై వైకాపా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరి మాజీ ఎమ్మెల్యే ,మంత్రి రోజా స్పందించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఈ దాడులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ డిమాండ్ చేశారు.

తిరుపతి పరువు, ప్రతిష్ట, ప్రశాంతతను మంటగలపడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తోన్నారంటూ రోజా ఆరోపించారు. గతంలో తిరుమల లడ్డూ మొదలుకుని, టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరు మంది మరణించడం ఇలా నేడు వైసిపి కార్పొరేటర్ల పై దాడి జరగడం అన్నీ కూడా తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని రోజా తెలిపారు.డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లు, మేయర్, దళిత ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిపై దాడులు చేయడం వరకు జరిగిన ఉదంతాలు దీనికి నిదర్శనమని అన్నారు.

మంత్రి నారా లోకేష్ వైసీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే మరోవైపు అదే వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేయిస్తోన్నాడంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేటర్ల పై దాడులకు దిగారని కొంతమంది మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు అంటూ రోజా కూటమి ప్రభుత్వ నేతల తీరుపై విమర్శలు కురిపించారు. ఇక ఈ ఘటనకు మొత్తం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కుమారుడు ప్రాతినిథ్యం వహించారంటూ రోజా ఫైర్ అయ్యారు.