R.K Roja: బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి… ఇక రాజకీయాలకు దూరమైనట్టేనా?

R.K.Roja: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రోజా ఒకరు. ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. ఇలా రాజకీయాలలోకి వచ్చిన ఈమె వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున 2014లో నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇలా 2014లోనూ అలాగే 19వ సంవత్సరంలో కూడా నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందడంతో ఈమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజులన్నీ కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనపై మరిన్ని బాధ్యతలు ఉన్నాయని ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఇక 2024 ఎన్నికలలో కూడా రోజా నగరి నుంచి పోటీ చేసి ఘోర ఓటమిపాలయ్యారు. మరోవైపు తన పార్టీ కూడా ఓడిపోవడంతో ఈమె తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ సప్ సీజన్ 4 కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు.

SUPER SERIAL CHAMPIONSHIP LAUNCH PROMO | Starts March 2nd, Sun @ 6PM | Zee Telugu

మార్చి రెండో తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుది అయితే ఈ కార్యక్రమానికి రోజా గెస్ట్ గా రావడంతో రోజా ఇకపై ఇండస్ట్రీలో కొనసాగుతారని స్పష్టమవుతుంది అయితే ఇలా ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన ఈమె రాజకీయాలకు దూరం అవుతారంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి.. ఇక ఈ కార్యక్రమానికి రోజాతో పాటు మరో నటి రాశి అలాగే సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.