నీ చీక‌టి బ‌తుకులు బ‌య‌ట పెడ‌తాం అనిత.. వైసీపీ నేతలు భారీ షాకిచ్చారా?

కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత వంగలపూడి అనిత వైసీపీ నేతల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ పై అనిత చేసిన కామెంట్లు వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. హద్దులు దాటి అనిత కామెంట్లు చేశారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.

అయితే అనిత కామెంట్లకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయ‌కురాలు రోజా రాణి ఘాటుగా బదులిచ్చారు. అనిత చీకటి బ్రతుకులు బయటపెడతామని రోజా రాణి అన్నారు. అనిత పాయకరావుపేట చింతామణి అని టీడీపీ బ్రోకర్ అని రోజా రాణి అన్నారు. అనిత కుటుంబ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రోజా రాణి కామెంట్లు చేశారు. అనిత ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని రోజా రాణి అన్నారు.

అనిత ఆడజాతికే కలంకం అని రోజా రాణి చెప్పుకొచ్చారు. స్త్రీ జాతి తలదించుకునే విధంగా అనిత ప్రవర్తిస్తోందని రోజా రాణి కామెంట్లు చేశారు. వైఎస్ భారతి పేరు ఎత్తే అర్హత కూడా అనితకు లేదని ఆమె తెలిపారు. అనిత ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని రోజా రాణి తెలిపారు. రోజా రాణి తిట్ల గురించి అనిత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే రోజా రాణి బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ, టీడీపీ నేతలు విమర్శల విషయంలో హద్దులు దాటుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనితతో విమర్శలు చేయించి టీడీపీ ముఖ్య నేతలు తప్పు చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దిగజారి చేస్తున్న విమర్శల వల్ల ప్రముఖ పార్టీల నేతలు ప్రజల ముందు చులకన అవుతున్నారు. అనిత, రోజా రాణి విమర్శల విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.