Hyper Aadi: ఇంటి మొత్తంలో రోజాకు నచ్చిన గది అదేనట… రోజా హోమ్ టూర్ వైరల్!

Hyper Aadi: సినీ తారల ఇళ్లు ఎలా ఉంటాయి? ఆ ఇంట్లో ఫర్నిచర్ ఎలా ఉంటుంది ? ఆ ఇంట్లో గదులు ఎలా ఉంటాయి ? ఇలాంటి విషయాలపై అభిమానులకు ఎప్పుడూ ఆసక్తే. అలాంటి ప్రేక్షకుల కోసం తన ఇంటిని ఇంకా అందంగా చూపించేందుకు చాలా మంది సెలబ్రెటీలు ఎంచుకునేదే హోం టూర్. ఇప్పటికే చాలా మంది సీరియల్స్ ఆర్టిస్టులు, స్టార్‌లు తమ ఇంటిని చూపించి యూట్యూబ్‌లో ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. ఆ వీడియోలకు వ్యూస్‌ కూడా మిలియన్లలోనే ఉండడం ఆసక్తి కలిగించే విషయం.

ఇక విషయానికొస్తే తాజాగా నటి రోజా కూడా తన ఇంటిని ప్రేక్షకులకు చూపించారు. అదెలా అనుకున్నారో తెలుసా ? సోషల్‌ మీడియాలో కాదు.. ఏకంగా టీవీ తెరపై. అవును నిజమే. దీని గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఈ విషయం తెలియాల్సిందే.

ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోపక్క బుల్లితెర హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈమధ్య సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమం కోసం రోజా తన హోం టూర్‌ని రిలీజ్‌ చేశారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు యూట్యూబ్‌ వేదికగా తమ ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేసినా, ఫస్ట్‌ టైం రోజా తన హోం టూర్‌ని మాత్రం ఏకంగా టీవీలోనే విడుదల చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే ఈటీవీ ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న రోజా, కమెడియన్లు చేసిన స్కిట్‌లకు మార్కులు ఇవ్వడమే కాదు, తాను కూడా మధ్యమధ్యలో పంచ్‌లు వేస్తూ అలరిస్తూ ఉంటారు. అలాంటి ఆమెతో స్కిట్‌ చేస్తే ఎలా ఉంటుంది? అది వాళ్లింట్లోనే అయితే? అని వినూత్నంగా ఆలోచించిన హైపర్ ఆది ఆలోచించి, తన బృంద సభ్యులతో కలిసి నగరిలో ఉన్న రోజా ఇంటికెళ్లారు. ఎప్పుడూ సెకన్ గ్యాప్ లేకుండా తన పంచ్‌లతో అలరించే ఆది, రోజాపైన కూడా కడుపుబ్బా నవ్వించే సాహసం చేశాడనే చెప్పుకోవచ్చు. అయితే రోజా తన ఇంటిని చూపిస్తూ ఫర్నీచర్, వంట గది, హాలు, డైనింగ్‌ను చూపిస్తూ వారితో సరదాగా ముచ్చటించింది. అందులో భాగంగా తనకిష్టమైన గది పూజగది అని, ఇంట్లోంచి తాను బయటకు వెళ్లే ముందు మొక్కుకొని బయల్దేరతారని ఆమె చెప్పారు. ఆ తర్వాత తనకిష్టమైన గది బెడ్రూమ్ అని తన ఇంటినంతా ఆది టీంకి చూపించారు. మొత్తానికి ఈ వారం టెలికాస్ట్ అయిన ఈ స్కిట్ ప్రస్తుతం యూట్యూబ్‌లో కనువిందు చేస్తోంది.