నటిగా, రాజకీయ నాయకురాలిగా, జడ్జిగా, తల్లిగా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న అభినయ సుందరి రోజా. 90ల కాలంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా సీనియర్ హీరోస్ అందరితో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో కలిసి రోజా చేసిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. సెల్వమణితో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన రోజా రాజకీయాలలోకు వెళ్లింది. వైసీపీ ప్రభుత్వం తరపున రెండు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నికైన రోజా జబర్ధస్త్ అనే కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరిస్తుంది.ఈ షో మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు రోజా జడ్జ్‌గా వినోదం అందిస్తూనే ఉంది.
రోజా భర్త సెల్వమణి మంచి దర్శకుడు. ప్రస్తుతం తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక రోజా, సెల్వమణిల కుమార్తె అన్షుమాలిక ప్రస్తుతం చెన్నైలోని ఒమేగా ఇంటర్నేషనల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. పుస్తకాలు చదవడం ఈమెకు చాలా అలవాటు కాగా, తనలోని భావాలను షిఫ్టింగ్ పర్సిప్షన్స్ అనే పుస్తక రూపంలో బయట పెట్టింది. ‘షిఫ్టింగ్ పర్సిప్షన్స్’ అనేది అన్షు రాసిన మొదటి పుస్తకమే అయినా కూడా ఇందులో ఆమె ఎంతో అనుభవంతో రాసినట్టుగా ఉంది. ఈ పుస్తకంపై పలువురు ప్రచురణ కర్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తల్లి మంచి నటి, తండ్రి మంచి దర్శకుడు వీరిద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవలు చేశారు. అయితే వీరిద్దిరి బాటలో కాకుండా అన్షుమాలిక కొత్త రూట్‌లో వెళుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రోజా అభిమానులు మాత్రం అన్షుని హీరోయిన్‌గా పరిచయం చేయాలని కోరుతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం రోజా తన కూతురి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరపగా, అవి ఫుల్ వైరల్ అయ్యాయి.