Roja: ప్రభుదేవా తో కలిసి స్టేజ్ పై డాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి రోజా…. రాజకీయాలకు దూరమవుతారా?

Roja: ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో నటి రోజా కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనంతరం రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వెళ్లారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె జగన్మోహన్ రెడ్డి హయాంలో టూరిజం శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.

ఇక 2024 ఎన్నికలలో పార్టీ ఓటమిపాలు అయింది. నగరి నియోజకవర్గం నుంచి రోజా పోటీ చేసినప్పటికీ ఆమెకు కూడా ఓటమి తప్పలేదు. ఇలా తమ పార్టీ ఓడిపోవడంతో తిరిగి రోజా సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జీ తెలుగులో ఓ కార్యక్రమానికి జడ్జిగా ఈమె పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా చెన్నైలో ఇటీవల కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఒక మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు వేదిక పైకి వెళ్లి డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఇక ఇందులో భాగంగా అలనాటి తారలు సంగీతా రంభ మీనా రోజా వంటి సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు అయ్యారు.

ఇకపోతే ప్రభుదేవాతో కలిసి వేదికపై రోజా అలాగే మీనా ఒక తమిళ మాస్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలను అధికారికంగా విడుదల చేయకపోయినా కార్యక్రమానికి వెళ్లినవారు ఈ వీడియోలను తీసి యూట్యూబ్లో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారాయి.

ఇలా చాలా రోజుల తర్వాత రోజా ఒక వేదికపై పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఆమె అభిమానులు రోజా ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఇక ఈమె రాజకీయాలకు దూరమవుతూ ఇలా సినిమాలలోనే కొనసాగుతారా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.