Hyper Aadi: హైపర్ ఆది కోసం గొడవ పడిన రోజా, ఆమని.. ఎందుకో తెలుసా?

Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యధిక రేటింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్న హైపర్ ఆది కోసం స్టార్ హీరోయిన్ రోజా ఆమని గొడవ పడిన సంఘటన చోటు చేసుకుంది. అసలు ఆది కోసం వీళ్ళు ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు అనే విషయానికి వస్తే…

సాధారణంగా ఈటీవీ ప్రతి ఒక్క పండుగకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆమని రోజా ఇద్దరు కలిసి శుభలగ్నం సినిమాలోని జగపతి బాబు కోసం గొడవపడే సన్నివేశాన్ని చేశారు.

శుభలగ్నం సినిమాలో మాదిరిగానే రోజా ఆమనికి డబ్బులు ఇచ్చి జగపతిబాబు పాత్రలో నటించిన హైపర్ ఆదిని తన సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది మరింత రెచ్చిపోతూ రోజా పై ప్రేమ చూపిస్తాడు.అదేంటి నాతో ఉన్నప్పుడు అంత ప్రేమ చూపించలేదని ఆమని అడుగుతూ తన భర్త తనకు కావాలని అంటుంది. ఇలా ఆయన మా ఆయన అంటే.. మా ఆయన అని హైపర్ ఆది కోసం వీరిద్దరూ గొడవ పడిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.