Rohini: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అందుకోవాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎన్నో అవమానాలను ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీలో కొనసాగాల్సి ఉంటుంది. అయితే కెరియర్ మొదట్లో ఎంతోమంది సెలబ్రిటీలకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది అదే అదునుగా భావించి కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు.
ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయి అంటూ ఎంతోమంది ఈ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడారు. అయితే కేవలం వెండితెర సెలబ్రిటీల విషయంలో మాత్రమే కాదు బుల్లితెర సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటి కమిట్మెంట్స్ అడుగుతుంటారని పలు సందర్భాలలో బుల్లితెర తారలు కూడా ఈ విషయాన్ని బయట పెట్టారు.
ఇకపోతే తాజాగా జబర్దస్త్ కమెడియన్ నటి రోహిణి సైతం ఇదే విషయాల గురించి వెల్లడించారు తాను కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఒక సీరియల్ ఆడిషన్ కోసం వెళ్ళాను అక్కడ నిర్మాత మేనేజర్ నా వద్దకు వచ్చి నీకు సినిమా అవకాశం ఇస్తే నాకేమిస్తావు అంటూ కమిట్మెంట్ గురించి మాట్లాడారు. ఆయన అప్పుడు మాట్లాడితే నాకు అర్థం కాలేదు నేను వర్క్ గురించి అడుగుతున్నారేమో నేను ఎంత కష్టమైనా చేస్తాను అంటూ సమాధానం చెప్పాను.
ఆ తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో అడిగారు అర్థమైందని ఆ క్షణం చాలా బాధపడ్డానని తెలిపారు.. ఇక వెంటనే నాకు తెలిసిన ఒక అంకుల్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి బాధపడటంతో ఆయన ఏకంగా నిర్మాతకు ఫోన్ చేసి చెడమడ తిట్టేశారు. అప్పుడు మేనేజర్ నిర్మాతకు మధ్య కూడా గొడవ జరిగింది అంటూ ఈ సందర్భంగా రోహిణి ఇండస్ట్రీలో కమిట్మెంట్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.