అందరినీ నవ్వించే రీతు చౌదరి జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా..?

యూట్యూబ్ వీడియోస్ టిక్ టాక్ వీడియోస్ ఎలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది బుల్లితెర మీద, వెండి తెరమీద నటించే అవకాశాలను అందుకున్నారు . అలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో కీలకపాత్రలో నటించిన వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. ఈమె సీరియల్ ఆర్టిస్ట్ గా కన్నా జబర్దస్త్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. తాళి, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నెగటివ్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు చౌదరి జబర్దస్త్ లో కూడా సందడి చేస్తోంది.

ఇలా సీరియల్స్ కన్నా జబర్థస్త్ ద్వార రీతు బాగా పాపులర్ అయ్యింది. జబర్థస్త్ లో రీతూ మీద ఆది వేసే పంచ్ లకి ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అంతేకాకుండా జబర్దస్త్ స్టేజ్ మీద ఆమె చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినా రీతు చౌదరి జబర్దస్త్ రీతూగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా ఏవైనా పండగ సందర్భాలలో టీవీ షోలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాఖీ పండుగ సందర్భంగా ఈటీవీలో కూడా “హలో బ్రదర్” అనే ఒక కొత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ తమ సొంత అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. ఇక సోదరులు లేనివారు అక్కడే ఉన్న కొంతమంది ఆర్టిస్టులకు రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటి చెప్పారు. ఈ క్రమంలో రీతు వంతు వచ్చినప్పుడు ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆమె సినిమాలలో నటించటం వారి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అందువల్ల వారికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో రీతూ చౌదరి నా చేత రాఖీ కట్టించుకోవడం మా అన్నకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉండటం వారికి ఇష్టం లేదు అని ఎమోషనల్ అయింది. ఆ సమయంలో శ్రీముఖి నీకు ఒక సర్ప్రైజ్ అంటూ రీతు చౌదరి అన్నని స్టేజ్ మీదకు పిలిచింది. రీతు చౌదరి సోదరుడు అమ్ములు అంటూ పిలవగానే రీతు చౌదరి ఒక్కసారిగా అతనిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సన్నివేశం చూసిన అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.