రేవంత్ vs కేటీఆర్ రసవత్తరమైన పోరు

ktr revanth

 తెలంగాణ లో యంగ్ పవర్ ఫుల్ లీడర్స్ ఎవరయ్యా కచ్చితంగా రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ అనే చెపుతారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తూ, భావి ముఖ్యమంత్రి అభ్యరిగా కేటీఆర్ ముందుకు దూసుకొని వెళ్తున్నాడు. టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి దక్కించుకొని, పీసీసీ రేసు లో దూసుకొని పోతున్నాడు ఎంపీ రేవంత్ రెడ్డి. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరుకు వేదికైంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.

ktr revanth telugu rajyam

 

 తెరాస తరుపున కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకోని అన్ని తానై ముందుకు సాగుతున్నాడు. ఇక మల్కాజ్ గిరి ఎంపీ గా రేవంత్ రెడ్డి కూడా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కీలకంగా మారే అవకాశం వుంది. గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించి బల్దియా మీద గులాబీ జెండా ఎగిరేలా చేసిన కేటీఆర్ , ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాడు. మరోపక్క కాంగ్రెస్ మాత్రం తన ఉనికి గట్టిగా చాటుకోవాలని చూస్తుంది. తెలంగాణ లో తమకంటే తక్కువ ఓటు బ్యాంకు కలిగి వున్నా బీజేపీ ప్రస్తుతం తామే రాష్ట్రంలో రెండో ప్రధాన పార్టీ అంటూ చెప్పుకుంటుంది. నిన్నటి నిజామాబాదు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తమ సొంత నేతలను కాపాడుకోలేక 29 ఓట్లు మాత్రమే సాధిస్తే, బీజేపీ మాత్రం 59 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

 గ్రేటర్ లో కూడా అదే ఊపు కొనసాగించాలని చూస్తుంది. కాబట్టి బీజేపీ నుండి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఒక పక్క తెరాస మరోపక్క బీజేపీ పార్టీ లను తట్టుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించటం అంత సులువైన విషయం కాదు.. గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కి కలిసివచ్చే అంశాలు అనేకం వున్నాయి. గ్రేటర్ పరిధిలో అభివృద్ధి అనేది అనుకున్న స్థాయిలో జరగలేదు. అండర్ బ్రిడ్జి లు, ప్లే ఓవర్ కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. అట్టడుగు స్థాయి వర్గాలు కూడా ప్రభుత్వ వసతులను పొందగలిగినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు, హైద్రాబాద్ పరిధిలో చిన్నపాటి వర్షం పడితే చాలు, రోడ్లు అన్ని జలాశయాలు అవుతున్నాయి, బస్తీలు అయితే చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్ లో పడి ఎందరో చనిపోతున్నారు.

hyd rain telugu rajyam

 ఇలా ఏ విధంగా చూసుకున్న హైదరాబాద్ వరకు అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు. అదే విధంగా తెరాస శ్రేణుల్లో కూడా అసమ్మతి కనిపిస్తుంది, దానిని తెలివిగా కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటే ఎన్నికల్లో మంచి విజయం సాధించవచ్చు, ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి కి ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కూడా కలిసివచ్చే అవకాశం వుంది. ఆంధ్ర జనాలకు రేవంత్ రెడ్డి అంటే అభిమానం వుంది. అది కూడా కాంగ్రెస్ కి అదనపు బలం. మరి దానిని ఎంత వరకు కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందో చూడాలి. చివరిగా ఈ ఎన్నికలు తెరాస మరియు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినా కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి నాయకత్వం పటిమకు పరీక్ష అనే చెప్పాలి.