గ్రేటర్ లో రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహం… బిక్కుబిక్కుమంటున్న తెరాస, బీజేపీ

Revanth reddy

 దుబ్బాకలో పరాజయం ఎదురుకావడంతో దానిని ఎలాగైనా పూడ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో తన దూకుడు చూపించాలని చూస్తుంది. అదే సమయంలో తెరాస పార్టీ కూడా తమకు ఎదురైనా పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరి వ్యూహాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ తమకు ప్రధాన ప్రతిపక్షము అన్నట్లు తెరాస భావిస్తుంది. అయితే దీని వెనుక భారీ కుట్ర దాగివుందని రేవంత్ రెడ్డి సరికొత్త పాయింట్ తెరమీదకు తీసుకోని వచ్చాడు.

Revanth reddy

 కొద్ది రోజులుగా బీజేపీ నేతలు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. రఘునందన్ రావు నేరుగా అమిత్ షాకు లేఖ రాశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా .. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించే అధికారం కిషన్ రెడ్డికి ఉండగా.. ఇక్కడకు వచ్చి.. ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

 బీజేపీ నేతలు చేస్తున్న అనేక ఆరోపణల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నకాని, కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్పితే కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు టీఆర్ఎస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే సాక్ష్యం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టని.. బీజేపీ అంతర్గత విషయాలు.. ఆయన ప్రగతి భవన్‌కు ప్రత్యేక దూత ద్వారా పంపుతూ ఉంటారని .. రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

 ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు.. ప్రత్యేకమైన వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. పోటీ తమ మధ్యే ఉందని చెప్పుకునేలా దుబ్బాక తరహాలో గ్రేటర్ రాజకీయం చేయాలనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ అనుమానిస్తుంది. అందుకే దానికి చెక్ చెప్పటానికి రేవంత్ రెడ్డి ఈ తరహా పాయింట్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తెరాస కుమ్మక్కయ్యాయనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకోని వెళ్లగలిగితే కాంగ్రెస్ అది వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అది ఒక్క రేవంత్ రెడ్డి తోనే అయ్యేపని కాదు, కాబట్టి కాంగ్రెస్ నేతలందరూ అదే వ్యూహాన్ని సరిగ్గా అమలుచేయాలి, అయితే ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంత వరకు కలిసివస్తారో చూడాలి