భార్య సీమంతం చూసి ఎమోషనల్ అయిన రేవంత్.. హౌస్ నుంచే భార్యకు ఆశీర్వాదం?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇక ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ టాస్క్ లలో గెలవటానికి ఒకరితో ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా ఈ సీజన్ లో జరిగే ప్రతీ ఎపిసోడ్ లో వినిపిస్తున్న పేరు రేవంత్.ఇక రేవంత్ ప్రతివారం నామినేషన్స్ లో ఉండడం నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ రేవంత్ కు చిన్న సర్ప్రైజ్ ఇవ్వడంతో రేవంత్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపు పొందింన రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకొని తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో అధిక కోపం వల్ల నాగార్జునతో చివాట్లు కూడా తింటున్నాడు. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే సమయానికి అతని భార్య గర్భంతో ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాలలో రేవంత్ తన భార్యని తెలుసుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఇటీవల రేవంత్ భార్య సీమంతం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో రేవంత్ ఒక్కడినే హౌస్ లో ఉన్న గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన బిగ్ బాస్.. అతని భార్య సీమంతం వేడుకలో పాల్గొనలేకపోయినందుకు ఆ వేడుకను రేవంత్ కి చూపించాడు. ఆ వీడియో చూసిన రేవంత్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ తర్వాత హౌజ్ మేట్స్ అందరినీ పిలిచి వాళ్ళ ఎదురుగా తన భార్యకి బొట్టు పెట్టి హౌజ్ నుండే ఆశీర్వదించాడు.