Home News రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : భోజనం తినేయండి .. బుల్లెట్ బైక్ గెలుచుకోండి !

రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : భోజనం తినేయండి .. బుల్లెట్ బైక్ గెలుచుకోండి !

కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యాపారాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అందులో హోటల్ వ్యాపారం మరింత తీవ్రంగా నష్టాలపాలైంది. ఈ నేపథ్యంలో మళ్లీ బిజినెస్ ను గాడిలో పెట్టడానికి పూణేలోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది. భారీ భోజనం పూర్తి చేసిన వారికి బుల్లెట్ బైక్ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ తెచ్చింది పుణెలోని శివాజీ హోటల్. ఒకవేళ రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోవాలంటే ఒక్క నిబంధన పెట్టింది. 60 నిమిషాల్లో 4కిలోల నాన్​వెజ్ భోజనాన్ని పూర్తిగా తినాలి.

Custom Made Bikes, Royal Enfield Modification, Customized Cars, India,  Puranam Designs

ఇలా చేస్తే విజేతకు రూ.1.65లక్షలు విలువ చేసే బుల్లెట్​ను బహుమతిగా ఇస్తోంది. ఎక్కువ మంది హోటల్​కు వచ్చి తినేందుకు ఈ ఆఫర్​ను తీసుకొచ్చామని రెస్టారెంట్​ యజమాని అతుల్ వాకర్ చెప్పారు. పుణెలోని వాడ్​గావ్​ మావల్ ప్రాంతంలో ఈ హోటల్ ఉంది.ఈ పోటీ కోసం ఐదు కొత్త బుల్లెట్ బైక్​లను రెస్టారెంట్​లో సిద్ధంగా ఉంచారు.

బ్యానర్​ను ఏర్పాటు చేయడంతో పాటు బుల్లెట్ భోజనంలో ఏమేం ఉంటాయో మెనూ సైతం పెట్టారు. నిబంధనలు కూడా ప్రస్తావించారు. ఈ కాంటెస్ట్​కు మంచి స్పందన వస్తోందని, చాలా మంది పాల్గొంటున్నారని యజమాని అతుల్ వైకర్ చెప్పారు. కాగా ఈ బుల్లెట్ భోజనం ధర రూ.2500. ఇప్పటి వరకు ఈ పోటీలో గెలిచి ఒక్కరు బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారట. ఇక భారీ భోజనం లో మొత్తం 12 రకాల వంటకాలు 4కేజీల బరువుతో ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పొంఫ్రెట్ ఫ్రైడ్​ ఫిష్​, చికెన్ తందూరి, డ్రై మటన్​, గ్రే మటన్​, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. మరికొన్ని ఉన్నాయి.

- Advertisement -

Related Posts

స్వలింగ వివాహం .. కేంద్రం ఏం చెప్పిందంటే ?

ఒకే జెండర్‌ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన...

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

Latest News