ఇండియన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఏఆర్ రెహమాన్. రెహమాన్ సంగీతాన్ని ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ తోనే ఎక్కువగా రెహమాన్ వర్క్ చేస్తూ ఉంటారు. తాజాగా పొన్నియన్ సెల్వన్ 2కి సంగీతం అందించారు. ఇక మణిరత్నం, రెహమాన్ కాంబినేషన్ మొదటి నుంచి రిపీట్ అవుతుంది.
అలాగే అగ్ర దర్శకులలో చాలా మంది రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అంత బ్రాండ్ వేల్యూ అతనికి ఉంది. ఇండియా నుంచి హాలీవుడ్ సినిమాలకి కూడా వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రెండు ఆస్కార్ అవార్డులని సైతం సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు బయట రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. విదేశాలలో కూడా తరుచు మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది అంటే లక్షలాది మంది చూడటానికి వస్తారు. ఈ నేపధ్యంలోనే తాజాగా పూణేలో రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది.
ఇక రెహమాన్ స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉన్నారు. లక్షలాది మంది ఆడియన్స్ ఆ పాటలని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఉన్నపళంగా పూణే పోలీసులు రంగంలోకి దిగారు. నేరుగా రెహమాన్ పాట పాడుతూ ఉండగానే స్టేజ్ మీదకి వెళ్లి ఆపేశారు. ఇప్పటికే చాలా టైమ్ అయిపోయిందని, లైవ్ షో ముగించాలని పోలీసులు సూచించారు.
సిటీస్ లో 12 గంటలు దాటితే స్టేజ్ షోలు నిర్వహించాకూడదు అనే నిబంధన ఉంది. ఈ నేపధ్యంలో టైమ్ దాటిపోవడంతో పాటు ఇంకా మ్యూజిక్ కన్సర్ట్ క్లోజ్ కాకపోవడం, ఆడియన్స్ కూడా బయటకి వెళ్లకపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. పోలీసులు వచ్చిన తర్వాత లైవ్ షోని రెహమాన్ ముగించారు. ఇక ఈ పూణే షోని గ్రాండ్ సక్సెస్ చేసిన అక్కడి ప్రజలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అని రెహమాన్ ట్వీట్ చేశారు.