ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్ని రాజధాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజధాని అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు రాజీనామాల రాజకీయాలు చేస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై తమకు నమ్మకం ఉంటే వైసీపీ నేతలంతా రాజీనామాలు చేసి ఎన్నికలను రావాలని సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు.
రాజీనామాకు సిద్ధమైన వైసీపీ మంత్రులు
కొన్నిరోజుల క్రితం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ మీడియా ముందు మాట్లాడుతూ రాజధానిపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తమకు నమ్మకం ఉందని, దీని కోసం తాను రాజీనామాకు కూడా సిద్ధమని, ఉత్తరంధ్రా నుండి ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధమని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అలాగే ఇప్పుడు మంత్రి సిదిరి అప్పలరాజు కూడా రాజీనామా అస్త్రాన్ని వాడుతున్నారు. విశాఖపట్నం నుండి గెలిచిన టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేసి ఎన్నికలకు దిగుతానని ప్రకటించి ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ నుండి తిరిగివచ్చే లోపు వైసీపీ నాయకులు ఈ ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై జగన్ ఏమంటారో వేచి చూడాలి.
టీడీపీ నాయకులకు అంత ధైర్యం ఉందా!
రాజీనామాల విషయంలో టీడీపీ నాయకులు చాలా వింతగా మాట్లాడుతున్నారు. ఎలాగంటే మొదట రాజీనామాలు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి ఎన్నికలకు రమ్మంటే మాత్రం రాలేకపోతున్నారు. ధర్మాన ఉత్తరాంధ్ర నుండి ఎన్నికలకు సిద్ధమంటే తాము విశాఖపట్నం నుండి అయితే ఎన్నికలకు సిద్ధమని చెప్తున్నారు, ఇప్పుడు అప్పలరాజు విశాఖ నుండి ఎన్నికలకు సిద్ధమంటే వైసీపీ నాయకులందరు రాజీనామాలు చేయాలని వింత వాదనలు, ధైర్యం లేని వాదనలు చేస్తున్నారు.