కరోనా మహమ్మారి ఎంటర్ అయిన కొత్తలో వణికిపోయిన ప్రజలు దానిని లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అది చేయాల్సిన నష్టం చేస్తుంది. ఎవరు సరిగ్గా మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి విస్తృతంగా పెరుగుతుంది. ఇప్పుడు యూకేలో వచ్చిన స్ట్రెయిన్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో లండన్‌లో పాజిటివ్ కేసులులు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త కరోనా స్పైక్ ప్రొటీన్‌లో ఏర్పడే రెండు మ్యుటేషన్లు మానవ కణజాల గోడలను సులభంగా అతక్కుంటూ, శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వలన పెద్ద ప్రమాదం ఏమి లేదని కొందరు చెబుతున్నా కూడా మరణాల సంఖ్య క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది.
ఇటీవల బ్రిటన్‌లో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తులలో కొత్త వైరస్ గుర్తించారు. ఇది చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఒకరి నుండి 70 శాతం మందికి పాకిపోతుంది. తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలోని డగ్లస్ కౌంటీలో జరిగింది. ఓ వ్యక్తి కరోనా బారిన పడగా, అతను నిర్లక్ష్యం వ్యవహరించి ఏడుగురి మృతికి కారణం అయ్యాడు. అతనిలో కరోనా లక్షనాలు కనిపిస్తున్నా కూడా ఆఫీసుకి వెళ్లడం, పలువురిని కలవడంతో చాలా మందికి కరోనా సోకింది. అయితే అతనిని కరోనా ఏమి చేయలేకపోయిన బాధ్యతారాహిత్యం వలన వందల మంది బాధితులయ్యారు
మరో వ్యక్తి కూడా ఇలానే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంంతో 300 మంది క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. డగ్లస్ కౌంటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరగగా ఇద్దరి వలన ఐదో వంతు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన గురించి విన్న తర్వాత అయిన కరోనా వచ్చిన వారు దయ చేసి క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నారు. ఒంటెల్లో ఉండే లామా అనే నానోబాడీలతో.. కొవిడ్-19(సార్స్ కోవ్-2) వ్యాప్తిని అత్యంత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.