దేశంలో నేటి నుంచి అమల్లోకి వచ్చిన కరోనా కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలు!

కరోనా వైరస్ చైనా తో పాటు పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో మరణఘటికలు విమోగిస్తుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తే కట్టడి చేయడం అసాధ్యమైన పని కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖలకు దిశా నిర్దేశం చేశారు. ఎవరైనా ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ వివరాలు, కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో ఎయిర్‌ సువిద ఫామ్‌ను నింపాలని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి.

కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కలవరపాటుకు గురిచేస్తుండడంతో బూస్టర్‌ డోస్‌గా కార్బోవ్యాక్స్‌ టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్‌ స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్‌ సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా చైనాలో విజృంభిస్తున్న కోవిడ్ 19 బీఎఫ్‌-7 వేరియంట్‌ కొత్త వేరియంట్ ఏం కాదనీ ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఏడాది జూలైలోనే బీఎఫ్‌-7 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.ఇప్పటికే 50కిపైగా దేశాల్లో బీఎఫ్‌-7 వ్యాపించి ఉంది.

ఇండియాలో కూడా గత ఆరు నెలలుగా బీఎఫ్‌-7 కరోనా వేరియంట్ మనుగడలోనే ఉంది. అధికంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రమాదకరస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడలేదు.కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదంటే వైద్య నిపుణులు చెప్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 90% పైగా జనాభా రెండు వ్యాక్సిన్ డోసులు ఇప్పటికే తీసుకున్నారు. ఇప్పటికే మన దేశ జనాభాలో కరోనా సబ్ వేరియట్లను తట్టుకునే వ్యాధినిరోధక శక్తి ప్రజల్లో పెరిగి హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉన్నందున కొత్త వేరియంట్లు పెద్దగా మనదేశంలో ప్రభావం చూపవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.