Kuja Dosham: సాధారణంగా గ్రహాల అనుకూలతలు మార్పులు కారణంగా ఒకరి జాతకంలో ఒక్కో గ్రహ దోష ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామందికి కుజదోష ప్రభావం ఉంటుంది. ఇలా కుజదోషం ఉన్నవారు ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతు ఉంటారు. కుజదోషంతో బాధపడే వారు ఏ పనులు చేస్తున్నా విజయవంతంగా పూర్తి కావు అలాగే వివాహంలో ఈ కుజ ప్రభావం కారణంగా ఎన్నో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఇలా కుజదోషంతో బాధపడే వారు కేవలం చిన్న పరిహారం చేస్తే కుజదోష నివారణ జరుగుతుంది.
సాధారణంగా కుజ దోష ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు కుజదోష ప్రభావం బట్టి పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కుజదోషం ఉన్న వారికి వివాహం ఆలస్యం కావడం లేదా సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటివి జరుగుతుంటాయి.ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఏడు ప్రదర్శనలు చేసి రావాలి.
ఇలా మనపై కుజదోష ప్రభావం తొలగిపోయే వరకు సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల కుజదోష ప్రభావం తొలగిపోతుంది. కుజ దోషం తొలగిపోయినప్పుడే మనం అనుకున్న పనులు నెరవేరుతాయని, సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే బ్రాహ్మణులకు దానధర్మాలు కూడా చేయాలి.