Regina To Pair Opposite Sai Dharam Tej Again : సాయి ధరమ్ తేజ్‌తో మళ్ళీ జతకట్టనున్న రెజినా.?

Regina To Pair Opposite Sai Dharam Tej Again

Regina To Pair Opposite Sai Dharam Tej Again : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజీనా జంటగా తెరకెక్కిన సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ . హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. అటు సాయి ధరమ్ తేజ్‌కీ, ఇటు రెజీనాకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయ్ కూడా.

అయితే, అంతకు ముందు ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ఆ తర్వాత ‘నక్షత్రం’ సినిమాల్లో ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో వీరిద్దరి మధ్యా ఏదో ఎఫైర్ వుందంటూ గాసిప్స్ కూడా వచ్చాయ్. అయితే, అదంతా వుత్తదే అని తేలిపోయిందనుకోండి.

ఇక, భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నుండి బయటపడిన తేజు, గత కొన్ని నెలలుగా రెస్ట్‌లోనే వున్నాడు. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవలే తన కొత్త సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేశాడు. కార్తిక్ దండు దర్శకత్వంలో తేజు ఓ సినిమా చేయబోతున్నాడు. రీసెంట్‌గా ఆ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. (Regina To Pair Opposite Sai Dharam Tej Again )

ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మండన్నా పేరు పరిశీలనలో వుండగా, ఓ కీలక పాత్ర కోసం రెజీనా పేరు వినిపిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు, కొన్ని కీలక సన్నివేశాల కోసం రెజీనాని ఎంపిక చేశారంటూ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.