మతం విషయంలో పట్టింపు లేదంటున్న రెజినా.. తన అసలు పేరు ఇది కాదంటూ షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి రెజీనా కసాండ్రా. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈమె. తాజాగా నటుడు అజిత్ హీరోగా నటించిన విదాముయార్చి సినిమాలో ముఖ్యపాత్రని పోషించింది. విలన్ పాత్రధారి అర్జున్ కి జోడిగా నటిస్తోంది రెజీనా.

అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తన మతం గురించిన ప్రస్తావన వస్తే అడిగిన వాళ్లకి క్లారిటీ ఇస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చింది. పుట్టినప్పుడు ఇస్లాం మతస్థురాలుగా పుట్టి పెరగటం క్రిస్టియన్ గా పెరిగాను అంటూ తన తల్లిదండ్రుల గురించి చెప్పింది. తన తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అని తండ్రి ఇస్లాం మతస్థుడని వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తాను ఇస్లాం మతస్తురాలి గానే పెరుగానని చెప్పింది.

అయితే తన ఆరేళ్ల వయసులో తన తల్లి తండ్రి విడిపోవడంతో తల్లి మళ్ళీ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి తన రెజీనా పేరుకి కసాండ్రా పేరుని తగిలించిందంట. దీంతో బాప్తీజం పొందిన రెజీనా బైబిల్ చదివినట్లు చెప్పుకొచ్చింది. నిజానికి తన అసలు పేరు రెజీనా మాత్రమే అని క్రిస్టియానిటీ లోకి కన్వర్ట్ అయినప్పుడు కసాండ్రా ఆడ్ అయిందని చెప్పింది రెజీనా. అయితే మతం విషయంలో తనకి ఎలాంటి పట్టింపులు లేవని చర్చి, మసీదు, గుడి ఇలా ఎక్కడికైనా వెళ్తానని చెప్పింది రెజీనా.

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే వెర్సటైల్ యాక్టర్ గా ఉండాలని భావించాను, అది నా నుంచి దూరం కాకుండా ఇన్నాళ్లు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగలిగిన అన్ని రకాల పాత్రలు చేయటమే నా గోల్. ప్రస్తుతం నేను గోపీచంద్ మలినేని, సన్నిడియోల్ గారి సినిమాలో చేస్తున్నాను. హిందీలో ఇంకొక రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి మేకర్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్పింది రెజీనా.