Sai Dharam Tej : యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి ధరమ్ తేజ్ తొలి వీడియో..!

Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సు లో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందు చిన్నదే అనుకున్న తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ దీపావళి సందర్భంగా తీసిన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో చాలా సన్నగా ఉన్నాడు తేజ్. ఆ తర్వాత మెల్ల మెల్లగా బరువు పెరుగుతూ వచ్చాడు. ఈ మధ్య రెగ్యులర్ గా కొత్తకొత్త ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు దర్శనమిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అందులో మునుపటి లుక్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

హీరో సాయిధరమ్ తేజ్ చాలకాలం తరువాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.కార్తీక్ దండు డైరెక్షన్ లో తేజ్ మిస్టరీ థ్రిల్లర్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు అని లేటెస్ట్ టాక్.గతంలో మేకర్స్ ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.అయితే కోవిడ్ అండ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,సాయిధరమ్ తేజ్ మార్చి 28 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు అని సమాచారం.తాజాగా,సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో తేజ్ కూడా కీలక పాత్ర చేయనున్నారు అని ఫిలింఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు.