Prabhas: ఎట్టకేలకు 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రభాస్… అమ్మాయి ఎవరంటే?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ప్రభాస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన పర్సనల్ లైఫ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉన్నారు. ప్రభాస్ కి ఇప్పటికి 45 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీస్తూనే ఉన్నారు.

ఇక ప్రభాస్ ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అనుష్కతో ప్రేమలో ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి కానీ ప్రభాస్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఇక ప్రభాస్ మరి కొంతమంది హీరోయిన్లతో డేటింగ్ ఉన్నారంటూ తరచూ ఏదో ఒక వార్త అయితే వైరల్ అవుతూనే ఉంది.

ఇకపోతే ప్రభాస్ పెళ్లి విషయంలో తన పెద్దమ్మ శ్యామల దేవి కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రభాస్ కి ఒక అదిరిపోయే సంబంధం చూశారని త్వరలోనే వీరి పెళ్లికూడా జరగబోతుందని తెలుస్తోంది. ఇక అమ్మాయి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అని సమాచారం ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం జరగబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చాలా రహస్యంగా ఈ పెళ్లి పనులు అన్నింటిని కూడా నిర్వహిస్తున్నారనీ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ ఇలా తరచూ ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు అయితే వస్తూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈయన 5 పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.