యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరుసగా ఆరు ఫ్లాపులు రావడానికి కారణం వాళ్లేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నా ఒక దశలో వరుస ఫ్లాపులతో తారక్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారనే తెలిసిందే. బృందావనం సక్సెస్ తర్వాత తారక్ నటించిన శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో తారక్ మాట్లాడిన మాటలను ఫ్యాన్స్ సైతం తేలికగా మరిచిపోలేరు.

నిజానికి శక్తి నుంచి రభస సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయాల వల్ల ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఎన్టీఆర్ సినిమా విడుదలైతే మార్నింగ్ షో నుంచే ఒక రాజకీయ పార్టీ వాట్సాప్ లో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేయడం మొదలుపెట్టేది.

ఈ నెగిటివ్ ప్రచారం వల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కమర్షియల్ గా కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదగకూడదని భావించి కొంతమంది ఈతరహా రాజకీయాలు చేశారని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం ఆగిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ పై రాజకీయపరమైన కక్షతో టార్గెట్ చేయకుండా ఉండి ఉంటే తారక్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి ఉండేవి. టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ టైగర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తానని మాటిచ్చానని చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకుని వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.