హీరోయిన్ సౌందర్య చనిపోవడానికి చిన్నతప్పే కారణమా.. ఏమైందంటే?

తెలుగు సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూనే 100కు పైగా సినిమాలలో నటించిన సౌందర్య చిన్న వయస్సులోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రైతు భారతం అనే సినిమాతో నటిగా సౌందర్య సినీ కెరీర్ మొదలైంది. ఆ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సౌందర్య వరుస హిట్లు సాధించారు.

బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వెళ్లిన సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. సౌందర్య తండ్రి కేఎస్ సత్యనారాయణ సౌందర్య జాతకం చూసి ఆమె 12 సంవత్సరాల పాటు మాత్రమే సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తుందని భావించారు. ఆ జాతకం నిజమై సౌందర్య చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. డైరెక్టర్ చిట్టిబాబు సౌందర్యకు కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.

సౌందర్య స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా ఆ డైరెక్టర్ కోసం గెలుపు అనే సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడం గమనార్హం. సౌందర్య, ఆమె సోదరుడు వెళ్లాల్సిన హెలికాఫ్టర్ వేర్వేరు కారణాల వల్ల మరో చోట ఉండటంతో సౌందర్య కేవలం 2 సీట్ కెపాసిటీ ఉన్న హెలికాఫ్టర్ లో ప్రయాణించారు. ఆ సమయంలో సౌందర్య హెలికాఫ్టర్ లో పరిమితికి మించి లగేజ్ ను తీసుకెళ్లారని సమాచారం.

సౌందర్య చేసిన ఆ చిన్న తప్పే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైందని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణం వల్లే కొంచెం ఎత్తు ఎగిరిన వెంటనే హెలికాఫ్టర్ కూలిపోయింది. సౌందర్య జీవించి ఉంటే ఇప్పటికీ ఆమె నటిగా కెరీర్ ను కొనసాగిస్తూ మరెన్నో సంచలన విజయాలను ఖాతాలో వేసుకుని ఉండేవారు. సౌందర్య భౌతికంగా మరణించినా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.