చిరంజీవి ఆర్జీవీ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి అసలు రీజన్ ఇదే?

కొన్ని కాంబినేషన్లు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్, పవన్ కళ్యాణ్ సముద్రఖని, మహేష్ రాజమౌళి కాంబినేషన్లు ప్రేక్షకులు ఊహించని కాంబినేషన్లు కావడంతో ఈ కాంబినేషన్లలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందనే సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది. హీరో నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. శివ సినిమా సక్సెస్ తో యూత్ లో వర్మకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అప్పటికే మెగాస్టార్ చిరంజీవికి యువతలో అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ కాంబినేషన్ లో సినిమా అంటే సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది. ఒకవైపు హిట్లర్ సినిమాలో మరోవైపు వర్మ సినిమాలో నటించాలని చిరంజివీ భావించారు. చిరంజీవికి జోడీగా ఊర్మిళ ఈ సినిమాలో నటించారు. వర్మ ధౌడ్ సినిమాతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది.

వర్మ చిరంజీవి సహనాన్ని పరీక్షించడంతో చిరంజీవి వర్మ సినిమాకు దూరమయ్యారు. ఆ సినిమా ఆగిపోవడం మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో హర్ట్ చేసింది. ఆ తర్వాత కాలంలో వర్మ పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. వర్మ తర్వాత ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేకపోయారు. వర్మ ప్రస్తుతం పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.