‘బిల్ – మిలిందా’ విడాకుల ‘గేట్లు’ తెరిచారెందుకు.?

Bill Melinda Gates Divorce

Bill Melinda Gates Divorce

ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసేశారు. ‘వైవాహిక బంధాన్ని ఇకపై కొనసాగించలేమనే నిర్ణయానికి వచ్చాకనే, విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయం మా పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోదు. సేవా కార్యక్రమాల విషయంలో కలిసే ముందడుగు వేస్తున్నాం..’ అంటూ బిల్ గేట్స్, మిలిందా గేట్స్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ప్రముఖులిలా విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ, బిల్ – మిలిందా వ్యవహారం వేరు.

ఎందుకంటే, కోట్లాది మంది ప్రజల జీవితాలు ఈ ఇద్దరి మీదా ఆధారపడి వున్నాయి. బిల్ గేట్స్ అంటే అపర కుబేరుడు మాత్రమే కాదు.. అంతకు మించి. ‘బిల్ మిలిందా’ అంటే వేల కోట్లు, లక్షల కోట్ల సంపద. అంతే కాదు, ఈ ఇద్దరూ కలిసి తమ సంపదలో మెజార్టీ భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. అదీ అసలు సంగతి. బిల్, మిలిందా సంపాదనలో ఎవరికి ఎంత దక్కుతుంది.? మిగిలిన సంపదలో పిల్లల వాటా ఎంత.? ఫౌండేషన్ సంబంధిత నిధులు ఏమవుతాయి.? వంటి ప్రశ్నల చుట్టూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బిల్ గేట్స్, మిలిందా గేట్స్.. మళ్ళీ తమ తమ కొత్త జీవితాల్ని విడివిడిగా వైవాహిక బంధాలతో ప్రారంభిస్తారా.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. కాగా, ‘బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్’ ద్వారా ఇదివరకు ఎలాగైతే సేవా కార్యక్రమాలు జరిగాయో, ఇకపై కూడా అలాగే జరుగుతాయని ఇరువురూ హామీ ఇవ్వడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.

ఈ సేవా కార్యక్రమాల విలువే లక్షల కోట్లు వుంటుంది మరి. ఎన్నో దేశాల్లో ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం అందుతోంది. విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నరు బిల్ గేట్స్, మిలిందా గేట్స్. అసలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకుడు.. అనే పేరు కంటే, గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలతోనే బిల్ గేట్స్ మరింతగా పెరు తెచ్చుకున్నారనొచ్చేమో. బిల్ గేట్స్ సేవా కార్యక్రమాలో మిలింద పాత్ర చాలా చాలా ప్రత్యేకం. ఆమె లేకపోయి వుంటే, బిల్ గేట్స్, ఇంతలా సేవా కార్యక్రమాలు ప్రపపంచ వ్యాప్తంగా చేపట్టి వుండేవారు కాదేమో.