కరోనా దెబ్బతో సినిమా హాళ్ళన్నీ మూతబడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రజలు సైతం ఈ పరిస్థితుల్లో సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసే ధైర్యం చెయ్యట్లేదు. ఏప్రిల్, మే నెలలో పెద్ద, మధ్య తరహా సినిమాలు చాలానే రిలీజ్ కావాల్సింది. అన్నీ వాయిదాపడిపోయాయి. ఆఖరి దశ చిత్రీకరణలో ఉన్న చిత్రాలు సైతం ఆగిపోయాయి. వాటిలో రవితేజ ‘ఖిలాడి’ కూడ ఉంది. ఇంకొక పది రోజుల షూటింగ్ జరిపితే టాకీ కంప్లీట్ అవుతుంది అనేలోగానే దర్శకుడు రమేష్ వర్మ కరోనాకు గురయ్యారు.
దీంతో రవితేజ ఉన్నపళంగా ప్యాకప్ చెప్పేశారు. ఇప్పుడప్పుడే రీస్టార్ట్ చేసే యోచనలో కూడ లేరు ఆయన. కేసుల సంఖ్యా తగ్గి, సిట్యుయేషన్ అదుపులోకి వస్తేనే సెట్స్ మీదకు వెళ్లేదని తేల్చి చెప్పేశారు నిర్మాతలతో. అయితే ముందుగా చెప్పిన మేరకు ఈ నెల 28న సినిమా రిలీజ్ కావాలి. అయితే షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో చేసేది లేక వాయిదా వేసేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని ప్రకటించారు. ‘క్రాక్’ లాంటి హిట్ తర్వాత వస్తున్నా చిత్రం కాబట్టి భారీఎత్తున రిలీజ్ ఆరోగ్యకరమైన వాతావరణంలో రిలీజ్ చేస్తేనే రిజల్ట్ గొప్పగా ఉంటుందని భావిస్తున్న రవితేజ వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు.