ఫైనల్ గా చిరు సినిమా కోసం కూడా వచ్చిన మాస్ హీరో.!

Mega 154

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో తమ ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిపోతున్నా మాస్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ ఇప్పుడు భారీ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా చేస్తున్న తాను ఇంత బిజీ షెడ్యూల్ లో ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రెడీ అయ్యినట్టుగా సినీ వర్గాలు వార్తలు కన్ఫర్మ్ చేసాయి.

మరి ఇప్పుడు రవితేజ లానే చిరు కూడా ఏజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల్లో దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్యగా పిలుస్తున్న ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్ర చేస్తున్నట్టు ఎప్పుడు నుంచో రూమర్స్ ఉండగా ఈరోజు నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లోకి వెళ్లినట్టు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.

అంతే కాకుండా ఈ సీన్స్ కూడా ఫస్ట్ డే భారీ యాక్షన్ సీన్ అందులోని మెగాస్టార్ తో కలిపి ఉన్న సీన్స్ తో స్టార్ట్ చేసారని వినికిడి. మొత్తానికి ఎయిర్ రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబో మళ్ళీ కనిపిస్తుంది. అందుకే అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.