Raviteja : ఆ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్: పాత కాంబినేషన్ రిపీట్ కానుందా.?

Raviteja : ‘గుడుంబా శంకర్’ తదితర సినిమాల్లో నటించిన బొద్దుగుమ్మ మీరా జాస్మిన్ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోషల్ మీడియాలో అమ్మడు హాట్ హాట్ హంగామా చేస్తోన్న సంగతీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ అమ్మడు కష్టపడి బాగా సన్నబడింది కూడా.
హాట్ అప్పీల్ సరే, సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్ కూడా ఓకే. కానీ, ఆఫర్ల సంగతేంటీ.? హా.! అవి కూడా వచ్చేశాయండీ. మీరా జాస్మిన్ హాట్ పోజులు చూసి, టాలీవుడ్ మేకర్లు కొందరు ఇంప్రెస్ అయ్యారట. దాంతో మీరా జాస్మిన్‌కి ఛాన్సులు క్యూ కడుతున్నాయట.
ఆల్రెడీ మాస్ రాజా రవితేజతో ఓ ఛాన్స్ దాదాపు ఓకే అయ్యిందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో మాస్ రాజా రవితేజ, మీరా జాస్మిన్ కలిసి ‘భద్ర’ సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో అబ్బో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో బాలయ్య తదితర స్టార్ హీరోల సరసన కూడా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది మీరా జాస్మిన్.
కావాలనే కెరీర్‌కి బ్రేకిచ్చి పెళ్లి చేసేసుకుంది మీరాజాస్మిన్. లేకుంటే, స్టార్ హీరోయిన్ హోదా అందుకునేదే. అదలా వుంటే, ఈ మధ్య రవితేజ.. ఇలియానా, శృతిహాసన్ వంటి సీనియర్ హీరోయిన్లకు సెకండ్ ఇన్నింగ్స్‌లో లైఫ్ ఇస్తూ ‘రాజువయ్యా మహరాజువయ్యా..’ అనిపించుకుంటున్నాడు. అలాగే మీరా జాస్మిన్ కూడా రవితేజ సినిమాతోనే బోణీ కొట్టబోతోందేమో చూడాలి మరి.