Raviteja : పండుగతో బిగ్ అప్డేట్ ఇచ్చిన రవితేజ..ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా!

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదని చెప్పాలి తన లాస్ట్ సినిమా క్రాక్ భారీ హిట్ తర్వాత జస్ట్ ఒక్క ఏడాది లోనే టాలీవుడ్ నుంచి ఏ హీరో కూడా అనౌన్స్ చెయ్యని విధంగా నాలుగు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసేసాడు. అయితే ఈ ప్రతి సినిమా కూడా దేనికదే కంప్లీట్ కొత్త జానర్ లో ఓకే చేశారు. అయితే ఈ సినిమాల్లో హారర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా “రావణాసుర”.

టైటిల్ కి తగ్గట్టుగానే అసురులకి చక్రవర్తిగా అంటే దయ్యాల పాలిట నాయకుడి తరహా పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా ఈరోజు హైదరాబాద్ లో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఈ సమయంలోనే ఒక కొత్త పోస్టర్ ని లాంచ్ చెయ్యడమే కాకుండా ఈ బోగి పండగ రోజు ఇంకో బిగ్ అప్డేట్ ని కూడా ఇచ్చాడు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీనితో మాస్ మహారాజ్ అభిమానుల కు మంచి ట్రీట్ దొరికింది. అయితే ఈ సినిమాపై ఇంకో ఆసక్తికర బజ్ ఏమిటంటే బహుశా మెగాస్టార్ చిరంజీవి కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇదెంత వరకు నిజం అవుతుందో చూడాలి.