Rashmika: సినీనటి రష్మిక మందన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు అయితే ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు ఇలాంటి తరుణంలోనే ప్రతి సందర్భంలోనూ కన్నడ ఇండస్ట్రీ గురించి ఈమె తక్కువ చేసి మాట్లాడుతున్న తరుణంలో కన్నడ ప్రేక్షకులు ఈమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కర్ణాటక ఓ ఎమ్మెల్యే ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ రష్మిక తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. గత కొంతకాలంగా కన్నడ సినిమాల గురించి కన్నడ భాష గురించి రష్మిక చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ప్రేక్షకులకు అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్న నేపథ్యంలో రష్మికపై చర్యలు తీసుకోవాలి అంటూ కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ఈ వివాదాలు మర్చిపోకముందే మరోసారి రష్మిక చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెరలేపాయి. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ప్రముఖ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో రష్మిక, రక్షిత్ హీరో హీరోయిన్లుగా కిరిక్ పార్టీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి.
ఇక డైరెక్టర్ రిషిబ్ నటుడిగా కాంతారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం ఫ్రీక్వెల్ షూటింగ్ జరుపుకుంటుంది. కాంతారా సినిమాలో రిషబ్ నటనకు గాను ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాపై అప్పట్లో రష్మిక కాస్త ఆలస్యంగా స్పందించారు. ఈ సినిమా చూడలేదు అంటూ ఆమె అప్పట్లో చెప్పడంతో వివాదానికి కారణమైంది అయితే తాజాగా మరోసారి ఇదే విషయం గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
కాంతరా సినిమా గురించి ప్రశ్న ఎదురవడంతో రష్మిక సమాధానం చెబుతూ…ఇది పాత కథే.. కానీ, ఇప్పటికీ ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది.నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి చెప్పలేను. కెమెరా ముందు ప్రొఫెషనల్‌గా ఉండటమే నాకు ముఖ్యమని తెలిపారు. ఏ విషయమైనా నాకు వ్యక్తిగతంగా ఉంటాయని ఆ విషయాలు బహిరంగంగా చర్చించడం ఇష్టం లేదు అంటూ మాట్లాడటంతో కన్నడ ప్రేక్షకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమె సినిమాలను కన్నడలో బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.