Rashmika Jealous : సక్సెస్, స్టార్‌డమ్.. ఈ యాంగిల్‌లో చూస్తే సాయి పల్లవి కంటే కీర్తి సురేష్, రష్మిక మండన్న చాలా హై పొజిషన్‌లో వున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కానీ, ఫ్యాన్ బేస్ పరంగా చూస్తే మాత్రం సాయి పల్లవిదే టాప్ ఛెయిర్. ఈ విషయం రష్మిక, కీర్తి సమక్షంలోనే సాయిపల్లవి అభిమానులు రుజువు చేసేశారు.
కీర్తి సురేష్ సంగతి పక్కన పెడితే, రష్మిక మండన్న ఒకింత జెలసీ (Rashmika Jealous ) ఫీలవుతోందా సాయి పల్లవిని చూస్తే.? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అందుక్కారణం, రష్మిక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సాయి పల్లవి అభిమానులు చేసిన హంగామానే కారణమట.
సాయి పల్లవి మాట్లాడుతున్నంతసేపూ ఆమె అభిమానులు గోల చేస్తూనే వున్నారు. దాంతో, ‘నేను ఏడవకూడదు.. నేను ఏడవను.. మీ అషభిమానం నన్ను ఏదోలా చేసేస్తోంది.. నేను మాట్లాడాలి. కాస్సేపు సంయమనం పాటించండి ప్లీజ్..’ అంటూ అభిమానుల్ని పదే పదే రిక్వెస్ట్ చెయ్యాల్సి వచ్చింది సాయిపల్లవి.
సాయి పల్లవి అభిమానుల హంగామా ఇలా వుంటే, రష్మిక మండన్న పదే పదే తన స్పీచ్ సందర్భంగా ‘లవ్ యూ.. లవ్ యూ..’ అంటూ అభిమానుల్ని ఎంకరేజ్ చేసేందుకు నానా తంటాలూ పడింది. అద్గదీ అసలు సంగతి.