Rashmika – Vijay Devarakonda: చాలా రోజుల నుండి రష్మిక, విజయడేవరకొండ మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ వాళ్ళు మాత్రం వల్ల రిలేషన్ గురించి బయటకు పడటం లేదు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఫ్యాన్స్ ని వావ్ అనేలా చేసారు. అప్పటి నుండి వీరి రిలేషన్ మీద ఇటు ఫ్యాన్స్ అటు మీడియా అనుమానిస్తూనే ఉంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ కోసం ముంబైలో ఉండగా , రీసెంట్ గా రష్మిక కూడా ముంబైలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నట్టు సమాచారం. ముంబైలో వీళ్లిదరు డేటింగ్ లో ఉన్నారనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది. పుష్ప సినిమా క్రేజ్ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక రెండు బాలీవుడ్ సినిమా లకు సైన్ చేసింది.పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూ లో అడుగగా 25ఏళ్ల వయసుకే పెళ్లేంటని తాను పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని చెబుతూనే తను ప్రేమించే వ్యక్తి తో చాలా సెక్యూర్ గా ఫీల్ అవ్వాలని లవ్ అంటే ఒకరికొకరు గౌరవం, ప్రేమ, బాధ్యత ఉండాలని చెప్పుకొచ్చింది.
ఇక న్యూ ఇయర్ టైం లో కూడా రష్మిక దేవరకొండ బ్రదర్స్ తోనే స్పెండ్ చేసింది. ఇక మాల్దీవులు కూడా వల్ల ఫ్యామిలీతో వెళ్లినట్టు సమాచారం విజయ్ దేవరకొండ తల్లి మాధవితో స్పెషల్ బాండ్ కూడా ఉందని రూమర్. వీళ్లిదరు వారి రిలేషన్ గురించి నోరు విప్పకపోయినా వాళ్ళు చెట్టా పట్టా లేసుకుని తిరగడం చూస్తుంటే ఈ ఏడాది చివరికి పెళ్లి చేసుకోబోతున్నారనే గాసిప్ లో నిజం ఉందనిపిస్తోంది. నిజంగా వీళ్లిదరు పెళ్లిచేసుకుంటే ఫ్యాన్స్ కి పండగే.