Rashmika: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్… కోట్లాదిమంది అభిమానుల కోరిక తీర్చబోతున్న రష్మిక?

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న రష్మికకు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది. అదేవిధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న రష్మిక ఇటీవల వరుస 3 బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా రష్మిక నటించిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ కావడంతో నిర్మాతలకు బోలెడన్ని లాభాలు వస్తున్నాయి. దీంతో ఈమెను ఒక లక్కీ చార్మ్ గా భావించి నిర్మాతలు ఆమె వద్దకు క్యూ కట్టారు. ఇలా రష్మిక సినిమాలు మంచి సక్సెస్ అవుతున్న ఈమె మాత్రం చాలా న్యూట్రల్ గానే తన జీవితాన్ని గడుపుతున్నారు.

తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది . నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ రష్మికది అని చెప్పాలి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం కోసం ప్రత్యేకంగా హీరోయిన్లు ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఐటమ్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ లో కనిపించడం సర్వసాధారణం . కానీ కెరియర్ పీక్స్ లో ఉండగానే రష్మిక మందన్నా ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఎందుకు అంటూ ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈమెనూ స్పెషల్ సాంగ్లో చూడాలనుకునే అభిమానుల కోరిక నెరవేరబోతున్నందుకు ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.