Anchor Rashmi: జబర్దస్త్ యాంకర్ గా విశేషమైన అభిమానాన్ని సంపాదించుకుంది రష్మి. తెరపై కూడా అందాల ప్రదర్శనతో వెండి తెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఒక వ్యక్తి నుండి సామాజిక మాధ్యమం ద్వారా బెదిరింపులను అందుకుంది రష్మీ. సాయి ప్రణీత్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా తనకు రష్మికి సంబంధించిన వీడియోను విడుదల చేస్తానంటూ పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించి రష్మి చాలా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చెత్త వ్యాఖ్యలను తన పట్టించుకోనని అంటూ చెప్పుకొచ్చింది. తన గురించి ఇలాంటి విషయాలను పోస్ట్ చేయాలనుకున్నా చేసేయ్ నేను వాటి గురించి పట్టించుకోను. నేను తప్పు చేయలేదు కనుక తప్పకుండా ముందుకు సాగుతానని పోస్ట్ చేసింది.
అంతలోనే రష్మీ అభిమాని ఒకరు ఆ పోస్ట్ ను డిలిట్ చేయాల్సిందిగా సాయిప్రణీత్ ని కోరడం జరిగింది. దయచేసి డిలీట్ చెయ్ భయ్యా.. అంటూ అతడు రిక్వెస్ట్ చేశాడు. అభిమాని పోస్టు స్పందించిన రష్మి.. ఆ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అతన్ని ఫాలో అవ్వడం మానేయండి అని సలహా ఇచ్చింది. ఇప్పుడు సాయిప్రణీత్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను విడుదల చేస్తాను అంటున్న వీడియో ఏంటో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.