మా సుధీర్ గర్ల్ ఫ్రెండ్ ఏ దొరికిందా.. రష్మీని మళ్ళీ వాడిస్తున్నారుగా!

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్ లో రష్మి గౌతమ్ కూడా ఒకరు. తన అందంతో పాటు వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. రష్మి ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే పాలు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా రష్మి సందడి చేస్తోంది. రేష్మి యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేయటంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఎంతోకాలం నుండి పుకార్లు విపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరికీ ఏకంగా పెళ్లి జరిగినట్లు వార్తలు వినిపించాయి.

రష్మి ఇటీవల “నా ఆట చూడు” అనే స్పెషల్ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ లో ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది తో కలిసి రష్మి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా ఈ టీవీ వాళ్ళు కనెక్ట్ చేసిన ఈ ఈ ఈవెంట్ లో బృంద మాస్టర్, తరుణ్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. ఎంతోమంది డాన్స్ కొరియోగ్రాఫర్ లు ఈవెంట్ లో పాల్గొన్నారు.

అయితే “నా ఆట సూడు” అనే ఈవెంట్కి యాంకర్గా వ్యవహరించిన రష్మి మీద ఆటో రాంప్రసాద్ హైపర్ ఆది వేసిన పంచ్ లకు రేష్మి కూడా ఎదురు దాడి చేసింది. ఈ షోలో రష్మి కూడా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అక్కడున్న వారందరినీ మెప్పించింది. ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా కండక్ట్ చేసిన ఈ షో మే ఒకటో తారీకు న ఈటీవీ లో ప్రసారం కానుంది. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.