మందులోడా ఓరి మాయలోడా అంటూ బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోయి డాన్స్ చేసిన రష్మి!

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా స్టార్ మాలో ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాలకు, ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఒకవైపు ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు స్టార్ మా లో ప్రసారం అవుతున్న ప్రత్యేక ఈవెంట్లలో రష్మీ సందడి చేసేవారు. ఇలా పలు ఛానళ్లలో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా స్టార్ మాలో ప్రసారమైన ఒక ఈవెంట్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇకపోతే తాజాగా స్టార్ మా పరివార్ కార్యక్రమం ద్వారా బుల్లితెర నటీనటులలను 24 గంటలపాటు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి సందడి చేశారు. ఇక వీరితో పాటు రష్మి ,శేఖర్ మాస్టర్ వంటి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన ప్రోమోలో భాగంగా రష్మి మందులోడ ఓరి మాయలోడ అనే పాటకు దుమ్ము లేపారు.ఇలా ఈ పాటకు రష్మీ మాస్ డాన్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను తనదైన శైలిలో ఆ కట్టుకున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

YouTube video player

ఇక ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర నటీనటులు అందరు ఒకే వేదికపై ఆటపాటలతో పెద్ద ఎత్తున సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.ఇక రష్మీ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా వెండితెరపై కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.